2022 సంవత్సరంలో నిర్మాతలకు భారీ షాకిచ్చిన మూడు సినిమాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 Three Disaster Movies In 2022 Year Tollywood Industry Details, Acharya, Khiladi,-TeluguStop.com

కొందరు స్టార్ హీరోలకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారని సమాచారం అందుతోంది.అయితే 2022 సంవత్సరంలో మూడు పెద్ద సినిమాలు నిర్మాతలకు భారీ షాకిచ్చాయి.

2022 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన ఖిలాడీ సినిమా విడుదలైంది.రమేష్ వర్మ డైరెక్షన్ లో 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు అంచనాలను మించి నష్టాలను మిగిల్చింది.

హిందీలో కూడా ఈ సినిమా విడుదల కాగా అక్కడ కూడా ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయనే విషయం తెలిసిందే.ఖిలాడీ సినిమా నష్టాలను నిర్మాతలు మరవక ముందే మార్చి నెల 11వ తేదీన రాధేశ్యామ్ విడుదలైంది.

సరికొత్త కథాంశంతో విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు కూడా మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది.

Telugu Flop, Acharya, Chiranjeevi, Ramesh Varma, Disaster, Khiladi, Prabhas, Rad

సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో పెదవి విరిచారు.ఫలితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా నష్టాలను మిగిల్చిన జాబితాలో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.ఈ రెండు షాకులను మరిచిపోకముందే ఆచార్య రూపంలో ప్రేక్షకులకు మరో షాక్ తగిలింది.

Telugu Flop, Acharya, Chiranjeevi, Ramesh Varma, Disaster, Khiladi, Prabhas, Rad

హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.ఆచార్య రిజల్ట్ మెగా అభిమానులను సైతం తెగ టెన్షన్ పెడుతోంది.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ఈ సినిమా ఎఫెక్ట్ పడితే ఆ సినిమాల కలెక్షన్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది.చిరంజీవి ప్రస్తుతం తర్వాత సినిమాల షూటింగ్ లను వేగంగా పూర్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube