ఆచార్య కాపీ ఆరోపణలు చేసిన రచయితలు ఎక్కడున్నారో.. నోరు మెదపడం లేదుగా?

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ఇందులో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

 Where Are The Authors Who Made The Allegatons Of Acharya Copy Details, Acharya-TeluguStop.com

మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ పేరును మోసింది ఈ సినిమా.దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించే పలు చర్చలు జరుగుతూ ఉండగా.మరోవైపు ఈ సినిమా గురించి కాపీ ఆరోపణలు చేసిన రచయితల గురించి వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమా కథ తనదని.కొరటాల శివ ఈ కథను కాపీ కొట్టి ఇస్తున్నాడని దుమారం రేపాడు.

తను ఒక కథను రాసుకొని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారిని కలిశానని తెలిపాడు.

ఇక వారికి కథ చెప్పగా.

వాళ్లు ఈ కథను కొరటాల శివ లాంటి పెద్ద దర్శకులు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారట.కానీ తాను మాత్రం కథను ఇవ్వనని అనడంతో.

తన కథనే కొరటాల కాపీ చేసి చిరంజీవితో సినిమా చేశాడు అని అన్నాడు.అంతేకాకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ లో ఒకరు కథలు రెండు ఒక్కటే అని అన్నాడని కూడా తెలిపాడు.

Telugu Acharya Copy, Acharya, Authors, Chiranjeevi, Cope, Koratala Shiva, Ram Ch

ఆ సమయంలో పెద్ద సినిమా కావటంతో కథను ఇప్పుడు బయట పెట్టలేనని.సినిమా విడుదల తర్వాత కథ వేరని ఆరోపణలు చేసిన వ్యక్తికే అర్థం అవుతుందని అన్నాడు.అయితే సినిమా విడుదల తర్వాత మళ్లీ ఈ సినిమా కాఫీ గురించి ఎటువంటి చర్చలు రాలేదు.రాజేష్ కథను కాపీ కొట్టి నట్లయితే ఈ పాటికి రాజేష్ ఆ పాయింట్ తో మాట్లాడేవాడు.

కానీ ఇప్పుడు ఇక్కడి నుండి ఎటువంటి స్పందన కూడా లేదు.పైగా సినిమా ప్లాప్ కూడా కావడంతో రాజేష్ ఈ విషయం గురించి ఏమైనా స్పందిస్తాడేమో అని అనుకున్నారు.

కానీ వారి నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube