మహారాష్ట్రలో ఒక చిన్న కోతి పిల్లను కుక్కలు చంపేశాయని కోతుల గుంపు పగతో రగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ ప్రతీకార చర్యలో రెండు పెద్ద కోతులు ఏకంగా 250 కి పైగా కుక్కలను చంపేశాయని కూడా వార్తలు వచ్చాయి.
ఈ రాష్ట్రంలో కుక్కలు కోతులు బద్ద శత్రువులు అనే పేరు కూడా వచ్చింది.అయితే ఇప్పుడు ఆ పేరు తప్పు అని చెప్పే ఒక వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ డాబర్ మాన్ కుక్కని ఓ కోతి హగ్ చేసుకుంది.ఈ క్యూట్ వీడియో ని @adorable.
monkey అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇంటి టెర్రస్‌పై ఉన్న ఒక కుక్కను కలవడానికి రూఫ్ టాప్‌ల మీదుగా ఒక కోతి దూకడం మనం చూడవచ్చు.
తర్వాత ఈ రెండు జంతువులు సంతోషంగా కలుసుకుంటాయి.ఒకదాన్నొకటి పలకరించుకుంటాయి. కోతి ప్రేమ, ఆప్యాయతతో కుక్క ముఖాన్ని కౌగిలించుకుంటుంది.కుక్క ఏమాత్రం అరవకుండా చాలా ప్రశాంతంగా కోతిని దగ్గరికి రానిచ్చింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కుక్క, కోతి రెండూ కూడా కౌగిలింత ఇచ్చుకుంటూ పోజులిచ్చాయి.
ఇంతకుముందెప్పుడూ పరిచయం లేని ఈ రెండు జంతువులు ఇలా ఆప్యాయంగా కౌగిలించుకోవడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక మహారాష్ట్రలో కోతి, కుక్కల మధ్య శత్రుత్వానికి తెరపడినట్లేనని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ రెండు జంతువులు భలేగా ఫ్రెండ్స్ అయ్యాయని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
3 రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో తాజాగా విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోకి ఇప్పటికే ఐదు లక్షలకు పైగా, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.
ఈ క్యూట్ వీడియోని మీరు కూడా తిలకించండి.







