సాధారణంగా హీరోలకు ఉన్నస్థాయిలో డైరెక్టర్లకు ఫ్యాన్ బేస్ ఉండదనే సంగతి తెలిసిందే.పెద్ద సినిమాలలో ఏ సినిమా సక్సెస్ సాధించినా ఆ క్రెడిట్ హీరోలకు సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ క్రెడిట్ దర్శకులకు వెళుతుంది.
ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ రాగా దర్శకుడు కొరటాల శివను ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, చరణ్ లాంటి టాలెంటెడ్ హీరోలు డేట్స్ ఇస్తే వచ్చిన అవకాశాన్ని కొరటాల సద్వినియోగం చేసుకోలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ “హానెస్ట్ గా చెబుతున్నా.నేను డైరెక్షన్ చేయలేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి, పూజా హెగ్డే ముందు కొరటాల శివ స్వయంగా ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
చిరంజీవి, రామ్ చరణ్ సీన్లు చేసుకుంటూ పోయారని తాను దర్శకుడిగా రిలాక్స్ అయ్యానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

అయితే చిరంజీవి మాత్రం కొరటాల శివ చెప్పింది నిజం కాదని దర్శకుడిగా కొరటాల శివకు ఏం కావాలో అదే డెలివరీ చేశామని వెల్లడించారు.కొరటాల శివ అభిమానులు ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి సంప్రదించలేదు.
కొరటాల శివ సినిమా ఫలితంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

అయితే ఆచార్య ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ సినిమా మాత్రం హిట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ గతంలో పలువురు ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలను ఇవ్వగా ఆ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమాల ద్వారా విజయాలను అందుకున్నారు.ఈ సినిమా విషయంలో కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు.







