ఓట్స్, కాఫీ పౌడర్.దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉండే నిత్యవసర వస్తువులే ఇవి.
ముఖ్యంగా ఓట్స్ విషయానికి వస్తే.నేటి రోజుల్లో ఫిట్‌నెస్‌కు ప్రధాన్యత ఇచ్చే వారు ఖచ్చితంగా తమ డైట్లో వీటిని చేర్చుకుంటున్నారు.
బరువును తగ్గించడంలోనూ, గుండె జబ్బులను అడ్డుకోవడంలోనూ, బ్లెడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలోనూ ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయి.అలాగే కాఫీ పౌడర్‌లో కెఫిన్ ఉన్నప్పటికీ.లిమిట్‌గా వాడితే బోలెడిన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను అందిస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
అయితే ఓట్స్, కాఫీ పౌడర్ లు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఈ రెండిటిరీ ఇప్పుడు చెప్పబోయే విధంగా యూస్ చేస్తే గనుక మీ ముఖ చర్మం న్యాచురల్‌గానే వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు లేటు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఆఫ్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవర జెల్, వన్ టేబుల్ స్మూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేన్ మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే గనుక స్కిన్ టోన్ పెరుగుతుంది.ముఖ చర్మం వైట్‌గా, బ్రైట్‌గా మెరుస్తుంది.మరియు చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు సైతం తొలగిపోతాయి.