ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆపై జూలు విదిల్చింది.వరుస గెలుపులతో దూసుకుపోయింది.
కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ లోని హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని పోస్ట్ చేసాడు.
ఈ ఫొటోలో బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లు అమ్మాయి గెటప్‌లో కనిపించారు.ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ‘కొత్త అభిరుచి’ అని క్యాప్సన్ ఇస్తూ రాసుకొచ్చాడు.
ఈ ఫోటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.వాషింగ్టన్ సుందరితో భువనేశ్వరి అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు.పరుగులను కట్టడి చేయడంలో తనదైన మార్క్ వేసాడు.2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.ఆ సీజన్‌లో భువనేశ్వర్ 23 వికెట్లు తీశాడు.
ఆ తర్వాత 2017 ఐపీఎల్‌లో 26 వికెట్లు తీశాడు.కాగా, 2021 లో జరిగిన ఐపీఎల్ లో భువీ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
ఆ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.అంతేకాక గత కొన్నేళ్లుగా వరుస గాయాల కారణంగా భువీ ప్రదర్శన తగ్గిపోయింది.కాగా, ఈ వేలంలో భువనేశ్వర్ కుమార్ బేస్ ధర రూ.2 కోట్లు.

ఇక మరోవైపు వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడితే, మెగా వేలంలో అతన్ని రూ.8.75 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.వాషింగ్టన్ సుందర్ బేస్ ధర రూ.1.50 కోట్లు కాగా, పలు జట్లు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి.సుందర్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడాడు.







