భారీ అంచనాలతో విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు.చిరంజీవి, చరణ్ చేసే సినిమా కాదని ఈ సినిమా విషయంలో కామెంట్లు వ్యక్తమయ్యాయి.
దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని భావించిన అభిమానులు సినిమా రిజల్ట్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశ చెందుతున్నారు.
రాజమౌళి సెంటిమెంట్ వల్లే ఈ సినిమా అంచనాలను అందుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.
ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ సెంటిమెంట్ ప్రూవ్ అయింది.
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సెంటిమెంట్ తప్పనిసరిగా బ్రేక్ అవుతుందని చిరంజీవి స్వయంగా చెప్పినా ఈ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది.

ఆచార్య సినిమాతో చరణ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.తొలిరోజే ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోగా వీకెండ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం టెన్షన్ తప్పడం లేదు.ఈ సినిమా నైజాం హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించడం మాత్రం సులువైన విషయం అయితే కాదు.ఆచార్య సినిమాకు బడ్జెట్ పెరగడంతో కొరటాల శివపై ఈ విధంగా కూడా ఊహించని స్థాయిలో భారం పెరిగిందని తెలుస్తోంది.







