ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో అన్న భయం అందరిలో నెలకొంది.రష్యా బలగాలు రోజు రోజుకి ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను ఆక్రమించడం మాత్రమే కాదు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ … అణుయుద్ధం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఈ టైంలో నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అణుయుద్ధం అనే పదం పుతిన్ వాడకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చే వాడిని.పుతిన్ అణుయుద్ధం అనే ప్రస్తావన తీసుకు వస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.
ఈ పరిణామంతో పుతిన్ రోజు రోజుకి ప్రపంచాన్ని బెదిరించే తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.అయితే అమెరికా దగ్గర.రష్యా వద్ద ఉన్న అణు సంపతి కంటే ఎక్కువ శక్తిమంతమైన అణు ఆయుధాలు ఉన్నాయని పుతిన్ కి గట్టిగా చెప్పే వాడిని.అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే.
పరిస్థితి వేరే రకంగా ఉండేది అంటూ ట్రంపు.ఉక్రెయిన్ పై రష్యా దాడి ఆపకుంటే ఏంటి అన్నదానిపై ఓ ఇంటర్వ్యూలో ఈ తరహాలో సమాధానమిచ్చారు.
దీంతో ట్రంపు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.







