సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.
ఇటీవలే మూడవ పాట కూడా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.
అలాగే మరో మాస్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
త్వరలోనే ఈ సినిమా మాసెస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట.ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా మంచి మాస్ లెవల్ లో ఉండేలా కట్ చేశారట.అంతేకాదు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 28న రిలీజ్ చేయ బోతున్నారట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

అయితే ప్రేక్షకులకు మరొక సందేహం కూడా వస్తుంది.ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి రిలీజ్ అవుతుందా లేదా అని.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కూడా అంతా సిద్ధం చేస్తున్నారు.
మరి మళ్ళీ వాయిదా పడుతుందా లేదంటే అనుకున్న సమయానికి వస్తుందా చూడాలి.







