అతగాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపైన విస్తృత ప్రచారం చేసినందుకు రికార్డులకెక్కాడు.అవును… ఇది చాలా అరుదైన రికార్డునే చెప్పుకోవాలి.అలాంటి ఓ రికార్డు ఉందని అతని వలెనే తెలిసింది మరి.అంతటి ఘనత సాధించి ఎవరంటే? ఉత్తరాఖండ్ హల్ద్వానికి చెందిన వైభవ్ పాండే ఈ రికార్డు సాధించాడు.తద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించగలిగాడు.ఇంతకీ అతగాడు సాధించిన ఘనత ఏమంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.ఒకే రోజులో 8 కేంద్రాల్లో కొన్ని వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు.
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలకు అతడు అబ్బురపడ్డాడు.
అతని పనితీరుకి ముగ్ధుడైన వైభవ్ పాండే. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 65 కార్యక్రమాలపై పూర్తి అధ్యయనం చేశాడు.
వీటితో పొందే లబ్ధిని సామాన్య ప్రజలకు వివరించాలని కంకణం కట్టుకున్నాడు.ఈ క్రమంలో 6 ప్రైవేట్ పాఠశాలలతో సహా 8 కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాడు.
అతడు ప్రచారం చేసిన 65 కార్యక్రమాల్లో పరీక్షా పే చర్చా, మన్ కీ బాత్, మేక్ ఇన్ ఇండియా, స్వశ్చ భరత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి.

డ్రైవర్లు, పాఠశాల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని వారికి అర్ధమయ్యేలా వివరించాడు.దీంతో పాటు ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో నగర ప్రజల కోసం వర్చువల్ సెషన్‌ను నిర్వహించాడు.తద్వారా బడుగు బలహీన వర్గాల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను గురించి వివరించాడు.
ఈ నేపథ్యంలో రైతులను కలిసి వారికి సంబంధించిన కార్యక్రమాలను గురించి కూడా వివరించాడు.రైతుల వద్దనుండి అతగాడికి మిశ్రమ స్పందన రాగా, యువతనుండి అతడికి పూర్తి మద్దతు లభించింది.
ఇక ఇతగాడు చేసిన సేవలకు గాను ఈ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.







