ప్రభుత్వ కార్యకలాపాలపైన విస్తృత ప్రచారం చేసినందుకు అతడు రికార్డులకెక్కాడు!

అతగాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపైన విస్తృత ప్రచారం చేసినందుకు రికార్డులకెక్కాడు.అవును.

ఇది చాలా అరుదైన రికార్డునే చెప్పుకోవాలి.అలాంటి ఓ రికార్డు ఉందని అతని వలెనే తెలిసింది మరి.

అంతటి ఘనత సాధించి ఎవరంటే? ఉత్తరాఖండ్​ హల్ద్వానికి చెందిన వైభవ్​ పాండే ఈ రికార్డు సాధించాడు.

తద్వారా వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించగలిగాడు.ఇంతకీ అతగాడు సాధించిన ఘనత ఏమంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.

ఒకే రోజులో 8 కేంద్రాల్లో కొన్ని వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలకు అతడు అబ్బురపడ్డాడు.అతని పనితీరుకి ముగ్ధుడైన వైభవ్​ పాండే.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 65 కార్యక్రమాలపై పూర్తి అధ్యయనం చేశాడు.

వీటితో పొందే లబ్ధిని సామాన్య ప్రజలకు వివరించాలని కంకణం కట్టుకున్నాడు.ఈ క్రమంలో 6 ప్రైవేట్​ పాఠశాలలతో సహా 8 కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాడు.

అతడు​ ప్రచారం చేసిన 65 కార్యక్రమాల్లో పరీక్షా పే చర్చా, మన్​ కీ బాత్​, మేక్​ ఇన్​ ఇండియా, స్వశ్చ భరత్, స్కిల్​ ఇండియా, డిజిటల్​ ఇండియా మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి.

"""/"/ డ్రైవర్లు, పాఠశాల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని వారికి అర్ధమయ్యేలా వివరించాడు.

దీంతో పాటు 'వోకల్​ ఫర్​ లోకల్​' స్ఫూర్తితో నగర ప్రజల కోసం వర్చువల్​ సెషన్​ను నిర్వహించాడు.

తద్వారా బడుగు బలహీన వర్గాల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను గురించి వివరించాడు.

ఈ నేపథ్యంలో రైతులను కలిసి వారికి సంబంధించిన కార్యక్రమాలను గురించి కూడా వివరించాడు.

రైతుల వద్దనుండి అతగాడికి మిశ్రమ స్పందన రాగా, యువతనుండి అతడికి పూర్తి మద్దతు లభించింది.

ఇక ఇతగాడు చేసిన సేవలకు గాను ఈ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.