రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందున్న ఖమ్మంలో కొన్ని పార్టీల నేతలు కుటిల రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య విమర్శించారు.
సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండి నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించే మంత్రి పువ్వాడ అభివృద్ధిలో ఖమ్మంను రాష్ట్రంలో ముందంజలో నిలిపారని, కుటిల రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు పువ్వాడ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ఆటలు ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ ముందు చెల్లవని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బిజెపి నేతలు తమ ఉనికిని కోల్పోయి వాట్సాప్ లీడర్లు గా అవతారమెత్తి సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని, రాజకీయంగా పువ్వాడ అజయ్ ను ఎదుర్కోలేక కుల రాజకీయాలకు తెరలేపారని, కనీసం ఖమ్మం జిల్లాకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా పువ్వాడ ను విమర్శించటం సిగ్గుచేటని, బీజేపీ యువ నేత సాయి గణేష్ మృతికి కారకులెవరు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.యువకుడిగా ఉన్న అతన్ని రాజకీయంగా ప్రేరేపించి చేతికి మందు అందించిన నాయకులు ఎవరో బిజెపి బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
వారి పార్టీ వారి స్వార్థ రాజకీయాల కోసం యువకుడిని బీజేపీ పార్టీ బలి తీసుకుందని దీని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో అలజడి వాతావరణాన్ని సృష్టించేందుకు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు పువ్వాడ అజయ్ ముందు సాగవని, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో లో అలాంటి వక్రబుద్ధి ఉన్న నేతలకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.