సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో పాపులర్ అవుతుందో చెప్పలేం.ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు విరివిగా వైరల్ అవడం మనం చూస్తూనే వున్నాం.
ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తాయి.మరికొన్ని చూసినపుడు జాలి కలుగుతుంది.
ఇంకొన్ని చూసినపుడు థ్రిల్ కలగక మానదు.ఇకపోతే అడవిలో క్రూర మృగాలు వేటాడకపోతే అవి తమ మనుగడను సాగించలేవు.
సింహం నుంచి మెుసలి వరకు వేట ద్వారానే తమ ఆకలిని తీర్చుకుంటాయి.
అయితే వీటికి దొరక్కుండా కొన్ని సాధు జంతువులు ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటాయి.
ఒక్కోసారి ఆ మాంసహార జంతువులకు చిక్కి ఆహారంగా మారతాయి.ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి ఇప్పడు తెలుసుకుందాం.నీటిలో ఉన్న మెుసలికి 1000 ఏనుగుల బలం ఉంటుందని నానుడి.
నీళ్లలోకి ఏ జంతువైనా వస్తే.దాని పనిఅయినట్లే లెక్క.
అయితే అదే మొసలి నీళ్లను వదిలి బయటకు వస్తే మాత్రం, ఏమి చేయలేదు.ఎలాంటి జంతువు చేతిలోనైనా ఇట్టే ఓడిపోతుంది.
ఇకపోతే ఇక్కడ నీళ్లు తాగడానికి వచ్చిన ఓ జీబ్రా మెుసలి నోటికి చిక్కింది.దాని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది జీబ్రా.కానీ మెుసలి పట్టు నుండి అది తప్పించుకోలేకపోయింది.మెుసలి బలంగా తన కోరలతో అత్యంత పెద్ద జంతువు అయినా జిబ్రాను నీటి మధ్య వరకు లాగి, దాన్ని తన కైవసం చేసుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సదరు వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.మీరు కూడా ఓ లుక్కేసి మీ కామెంట్స్ ని తెలియజేయండి మరి.ఇంకెందుకాలస్యం!
.