బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, హీరోయిన్ మలైకా అరోరా గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.ఈ జంటపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వెలువడ్డాయి.
ఇదిలా ఉంటే ఈ జంట ఈ సంవత్సరం వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు అనే బాలీవుడ్ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.అర్జున్ కపూర్ వయస్సు 36 కాగా, మలైకా వయసు 48 ఏళ్ళు.
అంటే వీరిద్దరి మధ్య దాదాపు 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది.వీరిద్దరి మధ్య లో ఏజ్ విషయం గురించి నెటిజన్స్ ప్రశ్నిస్తూ ట్రోల్స్ కూడా చేశారు.
ఏజ్ గ్యాప్ విషయంలో వారిద్దరి పై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా వారిని పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ వారి రిలేషన్ గురించి, వారి ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
అప్పుడు ఆ ప్రశ్నలను దాటేయకుండా అందుకు దీటుగా సమాధానం ఇస్తూ ఉంటారు ఈ జంట.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా కు మరొకసారి ఇలాంటి ప్రశ్న ఎదురయింది.ఈ విషయంపై స్పందించిన మలైకా అసహనం వ్యక్తం చేసింది.ఎందుకు అందరూ అదే విషయాన్ని పదేపదే పెద్దదిగా చేసి చూస్తున్నారు అంటూ మండిపడింది.

మన సమాజంలో వయసులో చిన్నవాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు అని ఆమె ప్రశ్నించింది.ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని సమాధానమిచ్చింది.అదేవిధంగా ధైర్యంగా ఎలా జీవించాలి అన్నది నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను.అలాగే నాకు నచ్చిన జీవితం జీవించమని నాకు ఎప్పుడు మా అమ్మ చెబుతూనే ఉంటుంది.
నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని నా జీవితాన్ని ఎలా జీవించాలి అన్నది నా వ్యక్తిగతం అంటూ కాస్త ఘాటుగా స్పందించింది.విడాకుల తరువాత ప్రతి ఒక్క స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి.
వాటన్నింటిని అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాలి అని మలైకా తెలిపింది.







