ప్రముఖ నటి రోజా ఎంతో కష్టపడి ఏపీకి మంత్రి కావాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.మంత్రిగా ఏపీలో పాలన విషయంలో తనదైన ముద్ర వేయాలని రోజా భావిస్తున్నారు.
అయితే రోజా సినిమాల ద్వారా, జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించడం ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారు.సౌత్ సినిమాల ద్వారా పాపులర్ అయిన రోజా ప్రస్తుతం మంత్రి కావడంతో సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్నారు.
రోజాకు ఏకంగా 7 కోట్ల రూపాయల 38 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి.ఈ మొత్తంలో స్థిరాస్తులు 4 కోట్ల 64 లక్షల రూపాయలు కాగా చరాస్థులు 2 కోట్ల 74 లక్షల రూపాయలుగా ఉన్నాయి.
రోజా కూతురు, కొడుకు పేరిట 50 లక్షల రూపాయల మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని బోగట్టా.రోజాకు 50 లక్షల రూపాయల కంటే కొంత మొత్తం తక్కువగా అప్పులు ఉన్నాయని సమాచారం అందుతోంది.

రోజా దగ్గర భారీ సంఖ్యలో కార్లు ఉన్నాయని రోజా గారు 7 కంటే ఎక్కువ కార్లు కలిగి ఉన్నారని తెలుస్తోంది.రోజా భర్తకు పలు ప్రాంతాలలో ఇళ్లు ఉండగా దాదాపుగా 60 లక్షల రూపాయల చరాస్థులు ఉన్నాయని బోగట్టా.సెల్వమణి గారికి 22 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని తెలుస్తోంది.రోజా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.2024 ఎన్నికల్లో కూడా రోజా ఎమ్మెల్యేగా గెలుస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

నగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం రోజా ఎంతగానో కృషి చేస్తున్నారు.రోజా భవిష్యత్తులో కూడా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.రాజకీయాలపై ఉండే ఆసక్తితో పాలిటిక్స్ లోకి వెళ్లిన రోజా పొలిటికల్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.
ఎమ్మెల్యేగా పలు సందర్భాల్లో రోజా ఓటమిపాలయ్యారు.అయితే 2014 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా 2019 సంవత్సరంలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం.







