కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.కేజిఎఫ్ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమాలో రాఖీ బాయ్ తల్లి శాంతమ్మ క్యారెక్టర్ కీ చాలామంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.
ప్రతి ఒక్కరూ ఆమె నటన చూసి ఫిదా అయ్యేంతలా ఎమోషన్ ని పండించింది అర్చన జోయిస్.ఈ సినిమా రాఖీ బాయ్ క్రేజ్ కీ ఎంత ప్లస్ పాయింట్ అయ్యిందో, తల్లి క్యారెక్టర్ లో నటించిన అర్చనకు కూడా అంతే గుర్తింపు దక్కింది.
అయితే ఈ సినిమా ముందు వరకు అర్చన ఎవరు అన్నది చాలామందికి తెలియదు.
ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అర్చన జోయిస్.
ఈ సినిమా తరువాత ఆమెకు ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.ఇకపోతే ప్రస్తుతం అర్చన కేజిఎఫ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అంతేకాకుండా ఆమె హోమ్ కు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ హోమ్ టూర్ వీడియోలో ఆమె తన గురించి,ఆమె కెరీర్ గురించి ఫ్యామిలీ గురించి ఇలా ఎన్నో విషయాల గురించి పంచుకుంది.

కేజిఎఫ్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అని అడగగా మహానటి సీరియల్ ద్వారా తనకు ఇలాంటి మంచి అవకాశం లభించింది అని చెప్పుకొచ్చింది అర్చన.అంతేకాకుండా హోమ్ టూర్ వీడియోలో తనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి పంచుకుంది.ఇకపోతే కేజిఎఫ్ 2 సినిమా ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే.
ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.







