విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.
టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు.మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు.
తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.