విద్యార్థినీ విద్యార్థుల తో కలిసి సహపంక్తి అల్పాహారం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లెలగూడ చల్లా లింగా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉప్మా, రాగి అంబలి, ఇడ్లి లతో అల్పాహారం స్వీకరించారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు హాస్టల్ లో గాని స్కూల్ లో గాని పిల్లలకి దొడ్డు బియ్యం పేట్టేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ లో మధ్యాహ్నం భోజనం సన్న బియ్యం అన్నం పెట్టాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు అల్పాహారము పెడతామని ముందుకొచ్చారు దానిలో భాగంగా శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు ఇండియాలో 22 రాష్ట్రాల్లో విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొన్ని స్కూలకి అల్పాహారం అందిస్తామని ముందుకు వచ్చారు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మీర్పేట్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.