దేశంలోని రైతులు ఇటీవలి కాలంలో చేపల పెంపకంపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.ప్రభుత్వం కూడా ఈ దిశగా రైతులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తోంది.
ఈ కోవలోనే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలవుతోంది.దీని కింద చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి సబ్సిడీ అందిస్తున్నారు.
పీఎం మత్స్య సంపద యోజన సెప్టెంబర్ 2020న ప్రారంభమయ్యింది.ఈ పథకం కింద చేపల పెంపకం వ్యాపారం ప్రారంభించడానికి షెడ్యూల్డ్ కులాలు, మహిళలకు 60 శాతం గ్రాంట్ అందజేస్తారు.
మరోవైపు మిగతా వారందరికీ 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు.మీరు కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు దాని అధికారిక వెబ్‌సైట్ https://dof.gov.in/pmmsyని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హలివే.
దరఖాస్తుదారు భారతదేశ శాశ్వత పౌరుడై ఉండాలి.దేశంలోని చేపల రైతులు, రైతులందరూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.చేపల పెంపకం ఎల్లప్పుడూ లాభదాయకమైన వ్యాపారంగా పరిగణిస్తారు.
ఈ పథకం కింద రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.మీరు ఈ వ్యాపారాన్ని ఎంత పెద్ద విస్తీర్ణంలో ప్రారంభిస్తే అంత ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.







