ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో అధిక ఎండలు, వడ గాల్పులు కారణంగా లిప్స్ తరచూ పొడిబారిపోయి అందహీనంగా మారుతుంటాయి.
దాంతో పెదవులను మళ్లీ మామూలు స్థితిలోకి తీసుకువచ్చేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలను పాటిస్తే సమ్మర్లో లిప్స్‌ను ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా మెరిపించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
కర్బూజ.
వేసవి కాలంలో విరి విరిగా దొరికే పండు ఇది.ఆరోగ్యాన్ని పెంపొందించి, శరీరాన్ని కూల్‌గా మార్చడంలో కర్బూజ అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే పొడిబారిన పెదవులను తేమగా, మృదువుగా మార్చడానికీ కర్బూజ ఉపయోగపడుతుంది.అందుకోసం కొన్ని కర్బూజ ముక్కలను తీసుకుని బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కర్బూజ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ వెన్న, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు పెదవులకు అప్లై చేసి.
ఉదయాన్నే వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే లిప్స్ హైడ్రేటెడ్‌గా, గ్లోయింగ్‌గా మారతాయి.
