ఆర్టీసీ అదనపు ఆదాయం దిశగా చర్యలు చేపడుతుంది.దానిలో భాగంగా ఇప్పటికే ప్రవేశపెట్టిన కార్గో సేవల ద్వారా విజయవంతంగా వందకోట్ల లాభాలు గడుస్తుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి తెలిపారు.
ఇప్పుడు కాచిగూడ ఆర్టిసి ప్రాంగణంలో మెడికల్ ఫార్మాసిని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో కలిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
ఆర్టీసీకి ఉన్న సొంత భవనాల్లో అదనపు ఆదాయ మార్గాలు మరియు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని మొదటగా పైలెట్ ప్రాజెక్టు కింద సిబిఎస్ బస్ స్టాండ్ మరియు కాచిగూడ బస్ స్టాండ్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో కూడా ఏర్పాటు చేస్తామని దాంతోపాటు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ప్రయాణికులకు ప్రజలకు అందుబాటులో నిర్ణీత రుసుముతో వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.







