అలీబాబా పేరును ఆ కంపెనీ ఎందుకు పెట్టుకుందో తెలుసా?

అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా . త‌న కంపెనీకి అలీబాబా పేరును ఎందుకు ఎంచుకున్నారో ఒక‌ ఇంటర్వ్యూలో తెలిపారు.

యూఎస్ఏ టుడే తెలిపిన వివ‌రాల ప్రకారం అలీబాబా అనే పదం అరబిక్ భాష నుండి వచ్చింది.దీనికి గల కారణాన్ని జాక్ మా సీఎన్ఎన్ కార్యక్రమంలో వివరించారు.

తాను శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కాఫీ షాప్‌కి వెళ్లిన‌ప్పుడు.అకస్మాత్తుగా అలీబాబా అనే పేరు అత‌ని మనసులో మెదిలింది.

దీంతో అతను కాఫీ అందించిన వెయిట్రెస్‌ని అడిగాడు.ఈ పేరు వినగానే ఏమి గుర్తుకు వ‌స్తుంద‌ని అడిగాడు.

Advertisement

దీనికి ఖుల్ జా సిమ్-సిమ్ అని ఆ మహిళా వెయిట్ర‌స్‌ బదులిచ్చింది.అయితే జాక్ మా ఇక్కడితో ఆగలేదు.

అతను మ‌రో 30మందిని ఈ ప్ర‌శ్న అడిగాడు.ఖుల్ జా సిమ్-సిమ్ అనే మంత్రంతోపాటు అలీబాబా గురించి చెప్పారు.

దీంతో జనాలకు బాగా అర్థం అయ్యే పేరు ఇది అని జాక్ మా అర్థం చేసుకున్నాడు.అప్పుడే తన కంపెనీకి ఈ పేరు పెట్టాలని జాక్ నిర్ణయించుకున్నాడు.

అయితే అత‌ను ఈపేరు పెట్టడానికి ఈ ఒక్కటే కార‌ణం కాదు.జాక్‌కి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వీడియో వైరల్ : లక్కీ బాయ్.. క్షణమాలస్యమైన ప్రాణం పోయేది.. మేటర్ ఏంటంటే..

అలీబాబా పాత్ర అంటే చాలా ఇష్టం.దీనికి మరో కారణాన్ని ఒక‌ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

కథలోని పాత్రధారి అలీబాబా దయగల వ్యక్తి, మంచి వ్యాపారవేత్త. గ్రామ ప్రజలకు కూడా సహాయం చేసేవాడు.

కంపెనీ పేరు ఇలా మొదలైంది.

అతని కంపెనీ లక్ష్యం కూడా ఇదే.ఖుల్ జా సిమ్-సిమ్ తరహాలో.జాక్ మా తన బృందానికి అలీబాబా అని పేరు పెట్టాడు.

దానిలో అనేక చిన్న కంపెనీలను ఏర్పాటు చేశాడు.ఈ కంపెనీ వినియోగ‌దారుల‌కు వివిధ సేవ‌ల‌ను అందిస్తుంది.

ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా వెబ్‌సైట్ అన్ని రకాల వస్తువులను అందిస్తుండ‌టం వ‌ల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రజలకు ప‌రిచ‌యం చేసిన‌ కంపెనీగా ఇది పేరొందింది.

చైనాలో అత్యంత విజయవంతమైన గ్రూప్‌లలో అలీబాబా సంస్థ‌ ఒకటి.

తాజా వార్తలు