కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రస్తుతం యశ్ పేరు మారుమ్రోగుతోంది.కేజీఎఫ్2 కలెక్షన్లు కళ్లు చెదిరే స్థాయిలో ఉన్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో హిందీలో సాధించిన కలెక్షన్లను ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ చేసింది.యశ్ కు జోడీగా నటించాలని చాలామంది హీరోయిన్లు ఆశపడుతున్నారు.
కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత తెలుగులో శ్రీనిధి శెట్టికి భారీ సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.అయితే కేజీఎఫ్ హీరో యశ్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు.ఒక సందర్భంలో యశ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
దీపికా పదుకొనే కూడా సౌత్ స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు.
యశ్ కామెంట్లు దీపికా పదుకొనే దృష్టికి వస్తే మాత్రం మాత్రం దీపిక కూడా మనస్సులోని మాటను బయటపెట్టే అవకాశం ఉంది.

ఫుల్ రన్ లో కేజీఎఫ్2 సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ తో పని చేయడానికి అన్ని భాషల స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు.యశ్ తర్వాత సినిమా ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా యశ్ పేరు మారుమ్రోగుతోంది.యశ్ తర్వాత సినిమాలకు కూడా హిందీలో కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది.యశ్ క్రేజ్ ను చూసి ఆయన అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.
హీరో యశ్ భవిష్యత్తులో టాలీవుడ్ స్టార్స్ కు కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.







