మహిళలను అక్రమ రవాణా చేయడం , వారిపై భౌతికదాడికి పాల్పడిన భారతీయుడికి సింగపూర్ కోర్ట్ 41 నెలల జైలు శిక్షతో పాటు 27,365 సింగపూర్ డాలర్ల జరిమానాను విధించింది.
‘‘జయహో క్లబ్’’
ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న బాల సుబ్రమణియన్ (47) కు ఈ మేరకు శిక్ష విధించినట్లు సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ (ఎంవోఎం) మంగళవారం తెలిపింది.బాధిత డ్యాన్సర్లను అతని బారి నుంచి రక్షించిన ఎంవోఎం అధికారులు క్షేమంగా భారతదేశానికి చేర్చారు.వీరిలో ఇద్దరిపై బాలసుబ్రమణియన్ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
2016లో ఆరు నెలల కాంట్రాక్ట్‌పై సింగపూర్ వచ్చిన బాధితులకు ఒక్క పైసా కూడా జీతం చెల్లించలేదని ది స్ట్రైయిట్స్ టైమ్స్ నివేదించింది.అంతేకాకుండా వారి పాస్‌పోర్ట్‌లు, వర్క్ పర్మిట్‌లు, మొబైల్ ఫోన్‌లను కూడా బాలసుబ్రమణియన్ లాక్కొన్నాడని.
తన అనుమతి లేకుండా భారతదేశానికి వెళ్లాలనుకుంటే అంతు చూస్తానని బెదిరించాడు.ప్రస్తుతం బాధితురాళ్లు ముగ్గురిని ప్రభుత్వ సంరక్షణలో వుంచారు .వీరి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వృత్తిపరమైన కౌన్సెలింగ్ సేవలను సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.భారతదేశానికి రావడానికి ముందు వీరికి తాత్కాలిక ఉద్యోగ పథకం కింద ఉపాధిని పొందినట్లు చెప్పారు.

మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద బాలసుబ్రమణియన్ నాలుగు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.బాధితుల గుర్తింపుపై గాగ్ ఆర్డర్ వుండటంతో వారి వివరాలు బయటకు చెప్పలేదు.మే 30, 2016న జయహో క్లబ్‌పై పోలీసులు దాడి చేసి మహిళలను రక్షించారు.ముగ్గురు బాధితులు పెద్దగా చదువుకోలేదు.సింగపూర్‌తో ఏమాత్రం పరిచయం లేనివారే.ఆ క్లబ్‌లోనే వీరిని బంధించిన బాలసుబ్రమణ్యం.
బయటకు రానిచ్చేవాడు కాదు.కార్మిక అక్రమ రవాణా నేరాలకు పాల్పడినందుకు గాను ఫిబ్రవరి 21న దోషిగా తేలాడు.జరిమానా చెల్లించని పక్షంలో మరో 20 వారాల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి వుంటుందని కోర్టు తెలిపింది.
కాగా… సింగపూర్ చట్టాల ప్రకారం… మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారికి తప్పనిసరిగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, మొదటిసారి నేరానికి గాను 1,00,000 సింగపూర్ డాలర్లు జరిమానా విధిస్తారు.







