తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో జరిగిన ఎపిసోడ్ లో బిందు మాధవి స్రవంతిని వాడుకున్నావ్ అని అఖిల్ ని అనడంతో.అఖిల్ ఆ మాటను వేరే విధంగా అర్థం చేసుకున్నాడు.
దీంతో వెంటనే రెచ్చిపోయిన అఖిల్ వాడుకున్నాను అంటే ఏమిటి అని పిచ్చెక్కిందా అంటూ బిందుమాధవి పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.ఇక ఇదే విషయం పై అఖిల్ కు సర్దిచెప్పాల్సింది పోయి నట్రాజ్ మాస్టర్ అఖిల్ పక్కన చేరి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
వాడుకున్నావు అని మొదట్లో అన్నప్పుడే కుమ్మేయాల్సింది అది ఎంత దారుణమైన మాట అది.అమ్మాయిని వాడుకోవడం ఏంటి అంటూ నట్రాజ్ మాస్టర్ అఖిల్ ను మరింత రెచ్చగొట్టాడు.
ఇక అప్పటికే కోపంతో రగిలి పోతున్న అఖిల్ కు నటరాజ్ మాస్టర్ మరిన్ని పుల్లలు పెట్టి అఖిల్ ని మరింత రెచ్చగొట్టాడు.మరొకవైపు అషు రెడ్డి యాంకర్ శివ తనను నామినేట్ చేయడం వల్ల చాలా ఫీల్ అయినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కెమెరా ముందు సోఫాలో పడుకొని.నాకు ఒకటి అర్థం కాదు.
బిగ్ బాస్ నేను ఎందుకు శివ వెనుక తిరుగుతున్నాను.అసలు ఆ పాయింట్ ఏంటి? ఉగాది పచ్చడికి పసుపు వేశానని నామినేట్ చేయడం ఏంటి? అంటూ రకరకాల ప్రశ్నలు వేసుకుంది.అంతేకాకుండా.శివ చుట్టూ తిరగడానికి శివ ఏమైనా పెద్ద మహేష్ బాబా.నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరు చుట్టూ తిరిగే లేదు.

కానీ వాడి చుట్టూ తిరిగాను అని అంటున్నాడు.మళ్లీ అతనికి వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తున్నారు అంటూ తనలోతానే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెబుతుంది అషు రెడ్డి.ఇక హౌస్ లో యాంకర్ శివ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు.
ఇంకా చెప్పాలి అంటే టైటిల్ రేసులో ముందు ఉన్న బిందుమాధవి, అఖిల్ కు గట్టిగానే పోటీ ఇస్తున్నాడు.మొదట జీరో తో మొదలుపెట్టిన శివ హీరోహీరోయిన్లు గా ఫీల్ అయ్యే వారికి కూడా గట్టిగా పోటీ ఇస్తూ, సెల్ఫ్ మేడ్ హీరోయిన్లను వెనక్కినెట్టి మరి గేమ్లో ముందుకు వెళుతున్నాడు.
ఇకపోతే అషు రెడ్డి యాంకర్ శివ ను మహేష్ బాబు అంటూ హేళన చేయడంతో ఈ విషయం పట్ల నెటిజెన్స్ అషు రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.








