కొన్నేళ్ల క్రితం వరకు సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కావడం కష్టమని మేకర్స్ లో భావన ఉండేది.టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇతర సౌత్ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టినా బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టేవారు కాదు.
అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాలీవుడ్ లో అంచనాలకు మించి విజయాలను సాధించాయి. కేజీఎఫ్1, పుష్ప ది రైజ్ సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా గురించి మరోసారి చర్చ జరుగుతోంది.అయితే సౌత్ ఇండియా నుంచి ఇండియాలో నంబర్ వన్ స్టార్ హీరో అయ్యే సత్తా ఉన్న హీరోలు ఎవరనే ప్రశ్నకు మాత్రం 9 మంది పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి.
సౌత్ లో చాలామంది సీనియర్ హీరోలకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నా వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకుని నంబర్ వన్ స్టార్ హీరో అయ్యే అవకాశం లేదు.
టాలీవుడ్ నుంచి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు నంబర్ వన్ స్టార్ హీరో అయ్యే సత్తా ఉంది.
తమిళం నుంచి విజయ్, అజిత్ లకు కన్నడ నుంచి యశ్ కు నంబర్ వన్ స్టార్ హీరో అయ్యే సత్తా ఉంది.బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల నుంచి కూడా నంబర్ వన్ స్థానం విషయంలో ఈ హీరోలకు పోటీ ఎదురవుతుందని చెప్పవచ్చు.

ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు వరుసగా భాషతో సంబంధం లేకుండా సత్తా చాటితే మాత్రం ఈ స్టేటస్ సొంతమవుతుందని చెప్పవచ్చు.ఆ గుర్తింపును సంపాదించుకుని ఎవరు నంబర్ వన్ స్థానంలో నిలుస్తారో చూడాల్సి ఉంది.టాలీవుడ్ స్టార్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.







