యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలో తేజస్విని హాస్పిటల్ ను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లా వైద్య అధికారి డాక్టర్ సాంబశివరావు నేతృత్వంలో సీజ్ చేశారు.తేజస్విని హాస్పిటల్ లో ఉన్న ముగ్గురు పేషెంట్లను భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
తేజస్విని హాస్పిటల్ పై లింగ నిర్ధారణ,లంచాలు, హాస్పిటల్ నిర్వహణపై బయటి వ్యక్తుల ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువు కావడంతో హాస్పిటల్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు తెలిపారు.