శివ జ్యోతి ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
న్యూస్ ప్రెజెంటర్స్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది.ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.
ఒకవైపు బుల్లి తెరపై ప్రసారం అయ్యే షోలలో పాల్గొంటూనే మరొకవైపు ఈవెంట్లు, న్యూస్ ఛానల్ తో బిజి బిజీగా ఉంది.బిగ్ బాస్ కీ వెళ్లకముందు తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా బాగా గుర్తింపు సంపాదించుకుంది.
బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే శివ జ్యోతి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అనే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందించింది శివ జ్యోతి.
ఈ క్రమంలో ఒక వీడియోలో శివజ్యోతి మాట్లాడుతూ నా గురించి నాకు తెలియకుండానే చాలా రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఒక ఈవెంట్ కి వెళుతూ మామిడికాయతో ఫోటో పెట్టాను అంతే.అప్పటి నుంచి సోషల్ మీడియాలో నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్ న్యూస్ అని సృష్టిస్తూ వార్తలు వైరల్ చేస్తున్నారు.వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ వేస్తున్నారు.
అది పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది అని తెలిపింది.అవును.
మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది.మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది.
నేను కూడా వెయిట్ చేస్తున్నా.ఇది ఎమోషనల్ గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను.
నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్ చేయనేమో అని అనుకుంటున్నారు.అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు.
ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్‌వాల్వ్ చేస్తున్నారు.అందుకే ఇలా వీడియో చేయాల్సి వచ్చింది దయచేసి.
ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం.కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్ ఉంటే నేనే మీ అందరితో షేర్ చేస్తాను.
అప్పటివరకు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ తెలిపింది శివ జ్యోతి.







