సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో విజయదుర్గ కూడా ఒకరు.గతంలో తాను కృష్ణానగర్ లో ఉండేదానినని ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
అక్కడ ప్రభుత్వం మా నాన్నకు ఇల్లు ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.కృష్ణానగర్ లో 7,000 రూపాయలు అద్దె చెల్లించేదానినని కరోనా సమయంలో రెంట్ కట్టుకోలేక జీడిమెట్లకు వెళ్లిపోయానని విజయదుర్గ చెప్పారు.
కరోనా సమయంలో నా భర్తకు యాక్సిడెంట్ అయిందని నాన్నకు కూడా సంపాదన లేదు కాబట్టి నాన్నను అడగలేదని విజయదుర్గ పేర్కొన్నారు.నాన్నకు పెన్షన్ వచ్చేదని నాన్నకు ఆ డబ్బులు సరిపోయేవని ఆమె తెలిపారు.నాన్న ఎప్పుడూ నా గురించి ఆలోచించేవారని ఆమె వెల్లడించారు.తాను కష్టాల్లో ఉన్న సమయంలో దేవుడు ఏదో ఒక విధంగా ఆదుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు.

కరోనా సమయంలో చాలామంది సాయం చేశారని కరాటే కళ్యాణి నాకు సరుకులు ఇచ్చారని ఆమె వెల్లడించారు.నాకు ఊరికే డబ్బులు తీసుకోవడం నచ్చదని ఎవరైనా తనకు వర్క్ ఇస్తే చాలని అనుకుంటానని ఆమె వెల్లడించారు.తాను ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.దసరా మూవీలో తాను చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.పని కోసం కాళ్లమీద కూడా పడతానని విజయదుర్గ వెల్లడించారు.

ఇల్లు కట్టడానికి 8 లక్షల రూపాయలు ఇస్తే 3 లక్షల రూపాయలు మోసం జరిగిందని ఆమె పేర్కొన్నారు.షూటింగ్స్ ద్వారా సంపాదించిన డబ్బును ఇంటిపై ఇన్వెస్ట్ చేశానని విజయదుర్గ తెలిపారు.హైట్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించేవని స్కూల్ లో పిల్లలు కొట్టేవారని విజయదుర్గ అన్నారు.
ఆ సమయంలో చచ్చిపోవాలని అనుకున్నానని ఆమె తెలిపారు. స్లీపింగ్ పిల్స్ వేసుకుందామని ప్రయత్నిస్తే అమ్మ ఆపిందని విజయదుర్గ వెల్లడించారు.
అమ్మ తనకు ఎంతో ధైర్యం చెప్పారని విజయదుర్గ ఎవరికీ తెలియని విషయాలను చెప్పుకొచ్చారు.







