ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే అటు బాలీవుడ్ పేరు చెప్పేవారు.కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ పేరే చెబుతున్నారు అందరూ.
ఎందుకంటే ఆ రేంజ్ లో ప్రస్తుతం టాలీవుడ్ ఎదిగిపోయింది అని చెప్పాలి.బాలీవుడ్ హీరోలు సైతం భయపడే విధంగా ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగా హవా నడిపిస్తున్నారు.
ఇదే సమయంలో అటు మలయాళ ఇండస్ట్రీ సైతం నిన్నటి వరకు ఉన్న హద్దుల్ని చెరిపేసి భారత దేశ వ్యాప్తంగా తమ సినిమాలతో సత్తా చాటుతున్నారు.ఇలా ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలను చూసి బాలీవుడ్ కి చెమటలు పడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలా అటు మలయాళం కన్నడ తెలుగు స్టార్స్ అందరూ వరుస విజయాలతో దూసుకుపోతు అంటే ఎందుకో తమిళ స్టార్స్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో ప్రేక్షకులను అలరించడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు.అయితే బాహుబలి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ కి దేశవ్యాప్తంగా బాటలు వేశాడు రాజమౌళి.
ఇక ఆ తర్వాత బాహుబలి2 తో బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకునే విధంగా రికార్డులు కొల్లగొట్టాడు.మరి మొన్న త్రిబుల్ ఆర్ తో కూడా సత్తా చూపించాడు.
బాహుబలి తో తెలుగు స్టార్ హీరో ప్రభాస్ కాస్త ఇప్పుడు హిందీ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు.మరికొన్ని రోజుల్లో తారక్ చరణ్ కూడా ఇదే బాటలో వెళ్లనున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అక్కడి హీరోల సినిమాల కంటే రాజమౌళి ప్రభాస్ సినిమాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసేంత ప్రస్తుతం టాలీవుడ్ ఎదిగింది అని చెప్పాలి.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ను కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. కే జి ఎఫ్ సినిమా తో యష్ సృష్టించిన సునామీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇలా సౌత్ ఇండస్ట్రీ నుండి ఇక ఇండియా బార్డర్ దాటి వెళ్లిపోతున్నాయి సినిమాలు.టాలీవుడ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమగా మారితే మలయాళం కన్నడ స్టార్స్ కూడా తమ సినిమాలతో మాయ చేస్తున్నారు.
కానీ అటు తమిళ హీరోలు మాత్రమే కొత్తదనాన్నిచూపించ లేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉండటం గమనార్హం.







