తమ దగ్గర లేనిది ఎదుటివారికి వెంటనే అడిగే అలవాటు చాలా మందికి ఉంటుంది.మీరు కూడా ఇటువంటి అలవాట్లలో చిక్కుకున్నట్లయితే వెంటనే వాటిని మార్చుకోండి.
ఎందుకంటే అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులను అడిగి ఏదైనా వస్తువు తీసుకుంటే వాటిలోని ప్రతికూల శక్తి మీ లోపలికి చొరబడుతుంది.
ఎవరినుంచైనా ఏదైనా తీసుకుంటే తొలుత తాత్కాలిక ప్రయోజనం చూస్తారు.కానీ కొంతకాలం గడిచాక మీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.అందుకే ఎవ్వరి నుండి ఎప్పుడూ తాత్కాలికంగానైనా తీసుకోకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాచ్
వాస్తు ప్రకారం, ఎవరి నుండి అయినా కాసేపటికైనా వాచ్ తీసుకుని ధరించవద్దు.ఎందుకంటే మనిషి జీవితం కాలంతో ముడిపడివుంటుంది.అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి చెడు ప్రభావాన్ని కలిగి ఉంటే.మీరు అతని గడియారాన్ని ధరిస్తే, ఆ చెడు సమయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది.
దుస్తులు

వాస్తుశాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా ఇతరుల దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు.ఎందుకంటే వారి దుస్తులు ధరించినప్పుడు మీరు వారి నెగటివ్ ఎనర్జీతో పాటు ఆ వ్యక్తి శరీరంలో ఉండే బ్యాక్టీరియాను కూడా తీసుకున్నవారవుతారు.
పాదరక్షలు
ఎవరైనాసరే ఇతరుల చెప్పులు, బూట్లు మొదలైనవి ధరించకూడదు.వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే మీ ఇంట్లో పేదరికం తాండవిస్తుంది.ఎందుకంటే శని స్థానం పాదాలలో ఉందని భావిస్తారు.అటువంటి పరిస్థితిలో మీరు ఎవరివైనా చెప్పులు ధరిస్తే, వారి జీవితంలోని శని దుష్పరిణామాలు మీ జీవితంలోకి చేరుతాయి.
పెన్

వాస్తుశాస్త్రం ప్రకారం ఎవరి నుంచి కూడా పెన్ను తీసుకోకూడదు.ఎందుకంటే దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు.దానితోపాటు మీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.
రింగ్
వాస్తు ప్రకారం ఒకరు ధరించిన రింగ్ మరొకరు ధరించకూడదు.ఎందుకంటే ఇది వ్యక్తి ఆరోగ్యం, జీవితం మరియు ఆర్థిక స్థితికి సంబంధించినది.
కాబట్టి అలా చేయడం మానుకోవాలి.







