ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.ముఖ్యంగా క్యాట్ వీడియోలు మనల్ని బాగా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
అవి చేసే కొన్ని పనులు భలే క్యూట్ గా, నమ్మలేని విధంగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బ్యూటెంగెబిడెన్ (Buitengebieden) అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే ఒక కోటి 70 లక్షల వ్యూస్ వచ్చాయి.ఇది ఈ రేంజ్ లో వైరల్ కావడానికి రీజన్ ఒకటే.
అది ఏంటంటే ఈ వీడియోలో కనిపించే పిల్లి ఒక అరుదైన టాలెంట్ ను బయటపెట్టింది.ఈ పిల్లి తన యజమానితో కలిసి కుండలు తయారు చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చక్రం పై కుండను తయారు చేస్తున్న ఒక వ్యక్తిని చూడొచ్చు.అయితే ఈ చక్రం గుండ్రంగా తిరుగుతూ ఉంటే మట్టి పాత్ర అందంగా తయారు కావడం చూసి పిల్లి చాలా ముచ్చట పడింది.
అది కూడా కుండలు తయారు చేయడానికి ప్రయత్నించింది.ఇందులో భాగంగా అది మట్టిని తన కాలితో మెల్లగా టచ్ చేసింది.అలా అది రెండు మూడు సార్లు తన కాలితో కుండలు తయారు చేసేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలో కుండ మరింత అందంగా తయారయింది.
ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.







