బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.రణబీర్ కపూర్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అయితే పెళ్లైన కొన్ని రోజులకే అలియా భట్ రణబీర్ కపూర్ షూటింగ్ లలో పాల్గొంటూ అభిమానులు అవాక్కయ్యేలా చేశారు.అయితే అలియా భట్ రణబీర్ దంపతులకు ఖరీదైన కానుకలు పెళ్లి కానుకలుగా దక్కాయని సమాచారం అందుతోంది.
అలియా భట్ రణబీర్ దంపతులకు అతిథుల నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి.రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ నూతన వధూవరులకు ఖరీదైన ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం.
ఈ ఫ్లాట్ విలువ ఏకంగా 26 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.రణ్ వీర్ సింగ్ రణబీర్ కపూర్ కు ఖరీదైన బైక్ ను బహుమతిగా ఇచ్చారని సమాచారం అందుతోంది.
హీరోయిన్ కరీనా కపూర్ అలియా భట్ కు మూడు లక్షల రూపాయల ఖరీదైన నెక్లస్ ను ఇచ్చారు.
మరో నటి ప్రియాంక చోప్రా కూడా అలియా భట్ కు నెక్లస్ బహుమతిగా ఇచ్చారని ఈ నెక్లస్ ఖరీదు 9 లక్షల రూపాయలు అని సమాచారం.

సిద్దార్థ్ మల్హోత్రా అలియా భట్ కు మూడు లక్షల రూపాయల విలువైన హ్యాండ్ బ్యాగ్ ను బహుమతిగా ఇవ్వడం గమనార్హం.కత్రినా కైఫ్ అలియా భట్ రణబీర్ లకు బ్రాస్ లేట్ లను బహుమతులుగా ఇవ్వగా వీటి ఖరీదు 14.5 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

దీపికా పదుకొనే అలియా భట్ రణబీర్ లకు ఖరీదైన వాచ్ లను బహుమతులుగా ఇచ్చారని సమాచారం.అలియా రణబీర్ దంపతులు కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.పెళ్లైనా అలియా భట్ సినిమాల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలను తీసుకోలేదు.







