యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని కానుక గా ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరొజు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు, అనంతరం యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురంకు స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఈఓకు అందజేశారు.ఈ సందర్భంగా మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

 Minister Puwada Ajay And His Wife Gifted A Kilo Of Gold To The Yadadri Temple-TeluguStop.com

యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు తన వంతుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం యదాద్రి నరసింహుడి కి మంత్రి పువ్వాడ దంపతులు స్వామి వారికి ఆయా కిలో బంగారంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మంత్రి దంపతులను ఆలయ ఆధికరులు, అర్చకులు శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube