జీవితంలో ప్రతిదీ బ్యాలెన్స్‌డ్ గా ఉంటే ఎంతో మంచిది.బ్యాలెన్స్ తప్పితే అవాంతరాలను ఎదురవుతాయి.
మహా పండితుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్య.మనిషి జీవన విధానంలో కొన్ని విషయాల గురించి హెచ్చరించాడు.కొన్ని విషయాలలో అతి చేయకూడదని తెలిపాడు.ఇలా చేస్తే జీవితంపై భారం పడుతుందన్నాడు.రామాయణంలో సీతామాత సౌందర్యాన్ని చూసిన రావణుడు ఆమెను అపహరించాడు.రావణుని మితిమీరిన అహంకారం కారణంగా రాముడు రావణుని చంపవలసి వచ్చింది.
అదేవిధంగా మంచి విషయంలో అతి చేయడం కూడా భారమవుతుంది.మహాభారతంలో కర్ణుడికి దాన గుణం అధికమైనకారణంగా తన కవచ కుండలను కోల్పోవలసి వచ్చింది.
అందుకే ఏ సందర్భంలోనైనా అతిగా చేయడాన్ని నివారించండి.శత్రుత్వంలో కూడా అతిగా చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది.
.అలాగని ఎవరితోనూ అతిగా శత్రుత్వం పెట్టుకోకండి.అవకాశం దొరికితే మీరు శత్రువుకు హానిచేసే స్థితిలో ఉండకూడదు.అలాంటప్పుడు ఆ వ్యక్తి మీ ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తాడు.
ఎవరితోనూ అతిగా స్నేహం చేయకండి.ఆ స్నేహితుడి దూరమైతే మీకు బాధ కలుగుతుంది.
అదేవిధంగా ఆహారం విషయంలో కూడా మెలగండి.ఎప్పుడూ అతిగా తినకండి.
అది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది.తరువాత మీరు పశ్చాత్తాపపడతారు.
ఇదేవిధంగా మనిషి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా భయపడకూడదని చాణక్య నీతి చెబుతోంది.భయం మనిషిని బలహీనపరుస్తుంది.కాబట్టి ఏ సందర్భంలోనైనా మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకోండి.గెలిచిన స్ఫూర్తిని గుర్తుంచుకోండి.

ఉద్రిక్తతలు లేని మనస్సుతో ఆలోచించడం వలన చెడు సమయాన్ని కూడా సులభంగా అధిగమించగల మార్గం దొరుకుతుంది.ఆందోళన, భయం వల్ల సరైన మార్గంలో నడవలేం.క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి, వర్తమానంలో జీవించడం అవసరం.కొన్నిసార్లు గతంలో జరిగిన చెడు అనుభవాలను తలచుకుంటాం.భవిష్యత్తు గురించిన చింతలు ప్రస్తుత సమస్యను ఎదుర్కోవటానికి పనికిరావు.వర్తమానాన్ని సరిగ్గా విశ్లేషించి, తదనుగుణంగా వ్యూహరచన చేసి సమస్యను ఎదుర్కోవడం ఉత్తమమని ఆచార్య చాణక్య తెలిపారు.







