బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.ఇకపై బ్యాంకు ట్రేడింగ్ సమయాల్లో మార్పులు జరగనున్నాయి.
కరోనా కారణంగా రిజర్వ్ బ్యాంక్ సేవల టైమింగ్స్‌ను తగ్గించిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకు టైమింగ్స్ ను మళ్లీ పెంచారు.
ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.మరి సవరించిన బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉన్నాయనే వివరాలు ముందుగా తెలుసుకోండి.
ఇకపై బ్యాంకులు ఉదయం 9 గంటల నుంచే పనిచేయనున్నాయి.కానీ బ్యాంకు ముగింపు సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఏప్రిల్ 18 నుంచి బ్యాంకులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.అలాగే ”కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో పాటు ప్రజలు కూడా కరోనా పరిస్థితుల నుంచి కోలుకోవడంతో బ్యాంకులు, మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది.” అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.కాగా సెంట్రల్ బ్యాంక్ ద్వారా నియంత్రణలో ఉన్న అన్ని మార్కెట్ ట్రేడ్ లకు సంబంధించి ప్రారంభ, ముగింపు సమయ వేళలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.కాల్/నోటీస్/టర్మ్ మనీ – ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి.

ఫారెక్స్ డెరివేటివ్‌లతో సహా విదేశీ కరెన్సీ (FCY)/భారత రూపాయి (INR) ట్రేడ్‌లు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పని చేస్తాయి.అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలలో మార్కెట్ రెపో లలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 2.30 వరకు పనిచేస్తాయి.రూపాయి వడ్డీ రేటు ఉత్పన్నాలు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు తెరుచుకుని ఉంటాయి.ప్రభుత్వ సెక్యూరిటీలలో ట్రై-పార్టీ రెపో,కమర్షియల్ పేపర్ అండ్ డిపాజిట్ సర్టిఫికెట్లు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు పనిచేస్తాయి.కార్పొరేట్ బాండ్లలో రెపో : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి అని రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది.కావున బ్యాంకు వినియోగదారులు ఈ సమయాలలో బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు చేసుకోగలరు.!
.






