రైతులను ఆకర్షిస్తున్నమొదటి వాణిజ్య డ్రోన్ ఇదే

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా వ్యవసాయ సంబంధిత పనుల్లో వాణిజ్య డ్రోన్‌ల వినియోగం ప్రారంభమైంది.పంత్‌నగర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (జి.

 Agriculture Scientists Launch Innovative Commercial Drone Details, Agriculture S-TeluguStop.com

బి.పంత్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం) దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం.వర్శిటీ తొలిసారిగా వ్యవసాయ డ్రోన్‌ను అభివృద్ధి చేసిందనే వాదన కూడా వినిపిస్తుంది.ఈ డ్రోన్ తో కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది నిమిషాల్లో సత్ఫలితాలను ఇస్తుంది.

అదే సమయంలో శ్రమ, ఖర్చును ఆదా చేయడానికి ఇది ఉత్తమ మార్గం.దీన్ని ప్రారంభించిన నేపధ్యంలో రానున్న రోజుల్లో పెద్దఎత్తున దీని వినియోగంపై దృష్టి సారించానున్నారు వ్యవసాయ నిపుణులు.

పంత్‌నగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఈ కమర్షియల్ డ్రోన్‌ను సిద్ధం చేశారు.క్రాప్ రీసెర్చ్ సెంటర్‌లో వైస్ ఛాన్సలర్ తేజ్ ప్రతాప్, రీసెర్చ్ డైరెక్టర్ అజిత్ నైన్ డ్రోన్‌ను ప్రారంభించారు.

డ్రోన్లతో గోధుమ పంటపై స్ప్రే ట్రయల్స్ కూడా నిర్వహించారు.ఉత్తరాఖండ్‌కు చెందిన తొలి కమర్షియల్ డ్రోన్ ఇదేనని వారు చెబుతున్నారు.

బహుశా దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రయోగాన్ని చేసిందని డాక్టర్ నయన్ తెలిపారు.దీనిని ఉపయోగించడం ద్వారా రసాయనాల వినియోగాన్ని 35 నుండి 40 శాతం తగ్గించవచ్చన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube