కేజీఎఫ్2 సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటే అలా జరిగేదా.. నష్టం తప్పదంటూ?

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు మూడు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 భిన్నమైన కథాంశాలతో తెరకెక్కగా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.

 Comparison Between Rrr And Kgf2 Movies Details Here Goes Viral , Comparison ,-TeluguStop.com

అయితే కేజీఎఫ్2 సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటే ఆర్ఆర్ఆర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించేది కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కేజీఎఫ్2 స్థాయిలో ఎలివేషన్లు ఆర్ఆర్ఆర్ మూవీలో లేవని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే మరి కొందరు మాత్రం తమకు కేజీఎఫ్2 అస్సలు నచ్చలేదని ఆర్ఆర్ఆర్ మూవీనే నచ్చిందని చెబుతున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారని కేజీఎఫ్2 సినిమాకు రిపీట్ ఆడియన్స్ లేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే రెండు సినిమాలలో ఏ సినిమా ప్రత్యేకతలు ఆ సినిమాకు ఉన్నాయి

Telugu Comparison, Kgf, Repeat Audience, Rrr, Weekdays-Movie

భారీ బడ్జెట్ సినిమాలు అయినప్పటికీ రెండు సినిమాల జానర్ లు వేరు కావడంతో ఒక సినిమాతో మరో సినిమాను పోల్చి చూడటం సరి కాదు.కేజీఎఫ్2 సినిమా తర్వాత విడుదలైనా ఆర్ఆర్ఆర్ ఇదే స్థాయిలో కలెక్షన్లు సాధించి ఉండేది.అయితే హిందీలో మాత్రం కేజీఎఫ్2 ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ పై పడేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 హవా తగ్గింది.

Telugu Comparison, Kgf, Repeat Audience, Rrr, Weekdays-Movie

ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.ఆర్ఆర్ఆర్ మాత్రం అన్ని భాషల్లో వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా నిలిచి కలెక్షన్లను సొంతం చేసుకుంది.అయితే కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలను చూసిన ప్రేక్షకులు సాధారణ కథతో తెరకెక్కిన సినిమాలను ఇదేస్థాయిలో ఆదరిస్తారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాల వల్ల థియేటర్లు కళకళలాడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube