సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ దరఖాస్తులకు గడువు పొడిగించాలని,చేసుకున్న దరఖాస్తులలో తప్పులను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని పి.వై.
ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,పి.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పోలెబోయిన కిరణ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు పి.వై.ఎల్, పి.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి,ఏఓ శ్రీదేవికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెట్ దరఖాస్తు గడువు సమయాన్ని మరో పది రోజులు పొడిగించాలని,దరఖాస్తులోని తప్పులను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని, అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వమే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు భోజనం అవకాశం కల్పించాలని, కోచింగ్ కు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలని కోరారు.
టెట్ లో సబ్జెక్టు వారిగా మార్కులు కేటాయించాలని,ఇతర సబ్జెక్టుల్లో మార్కులు తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీ.వై.ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు ధరావతు రవి,జిల్లా అధ్యక్షుడు నలగొండ నాగయ్య,పి.డి.ఎస్.యూ నాయకులు శివ,నవీన్,సాయి,గౌతమ్,వెంకటేష్, అర్జున్,సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.