బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో లాకప్. బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న రియాల్టీ షోలో అన్నింటిలో కూడా ఈ షో ప్రథమ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ షోలో కాంట్రవర్సీ నటులు అందరిని ఒక చోట చేర్చి వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయట పెట్టడమే యొక్క ముఖ్య ఉద్దేశం.ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు వారి జీవితంలో జరిగిన విషయాలను చెబుతూ ప్రేక్షకులతో పాటు, ఆ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కంగనా రనౌత్ కి కూడా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక పోతే ఈ షోలో మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న పూనం పాండే ఈ షోలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది అన్న విషయం తెలిసిందే.ఈ షోలో భాగంగా పూనమ్ పాండే తన జీవితంలో జరిగిన ఒక సంఘటనల గురించి వివరిస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల తన భర్త తనను ఏ విధంగా వేధించాడో చెప్పుకుని కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి తన జీవితంలో మరొక రహస్యాన్ని బయటపెట్టింది.
తనని ఒకానొక సమయంలో తన ఇంట్లో తల్లిదండ్రులే మెడబట్టి బయటికి చేసినట్లు చెబుతూ కన్నీరు పెట్టించింది.
ఈ సందర్భంగా పూనం పాండే మాట్లాడుతూ.
నాలుగేళ్ల క్రితం నేను కూడా అందరిలాగే తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను.

అయితే ఒకరోజు సడన్ గా ఏమి జరిగిందో తెలియదు కానీ నాకు ఏ కారణం చెప్పకుండా నా తల్లిదండ్రులే నన్ను మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.కారణం ఏంటి అని నేను అడిగినా సమాధానం చెప్పకుండా ముఖం మీదే తలుపులు వేసేసారు అని చెప్పుకొచ్చింది.నన్నెప్పుడు నా కుటుంబం సొంత మనిషిలా చూడలేదు డబ్బులు ఇచ్చే మెషీన్ లా మాత్రమే చూసారు అని తెలిపింది.
బయట నా గురించి చేదుగా మాట్లాడుతున్నారని, దాని వలన కుటుంబం పరువు పోతుందని భావించారే కానీ వారె తప్ప నన్నెప్పుడు అర్ధం చేసుకోలేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది పూనమ్ పాండే. ఈమె మాటలకు మిగతా కంటెస్టెంట్లు కూడా కంటతడి పెట్టారు.







