మెగా గాడ్ ఫాదర్.. ఎవరి పాత్ర ఏంటో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Megastar God Father Movie Characters Reveal, Megastar Chiranjeevi, God Father,-TeluguStop.com

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో పూర్తిగా స్టార్స్ తో నింపేశారు.గాడ్ ఫాదర్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అంటేనే ఒక రేంజ్ లో అంచనాలు పెరిగి పోయాయి.

ఇప్పుడు చిరంజీవి కి తోడుగా సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించ బోతున్నారు.

అయితే ఎవరి పాత్ర ఏంటి అని ఆడియెన్స్ కన్యూజ్ అవుతున్నారు.

ఇంత మంది స్టార్స్ ఉండడంతో ఎవరు ఏ పాత్రలో చేసున్నారా అని ఆలోచిస్తున్నారు.ఒరిజినల్ సినిమా కంటే గాడ్ ఫాదర్ సినిమాకు ఎక్కువుగా ఖర్చు చేస్తున్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Telugu Anasuya, God, Chiranjeevi, Godcharacters, Nayantara, Puri Jagannath, Salm

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని.చిరంజీవి పాత్రకు ఆప్తుడిగా సల్మాన్ కనిపించ బోతున్నట్టుగా టాక్.ఇక నయనతార ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కనిపిస్తుంది.

ఇక నయన్ భర్త పాత్రలో సత్యదేవ్ కనిపిస్తుండగా మెయిన్ విలన్ ఆయనే నట.ఈ విషయం అందరిలో ఆసక్తి రేకెత్తించేలా చేస్తుంది.చిరంజీవి పాత్రకు ఆప్తుడిగా సల్మాన్ కనిపించ బోతున్నాడని.అనసూయ ఒక మీడియా సంస్థ అధినేత పాత్రలో కనిపిస్తుందట.పూరీ ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపిస్తున్నాడట.ఇలా ఈ సినిమాలో ప్రతి పాత్ర కు ఇలా ప్రాముఖ్యత ఉంటుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube