రకరకాల అభిరుచుల గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.కొందరికి కుక్కలను పెంచుకోవడమంటే ఇష్టం.
మరికొందరికి పిల్లులను పెంచుకోవడమంటే చాలా ఇష్టం.అయితే ఎలుకను పెంచే హాబీ గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉంటున్న ఓ మహిళకు ఇలాంటి హాబీ ఉంది.ఆ మహిళ తన వంటగదిలో 50 ఎలుకలను పెంచుతున్నదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఈ మహిళ పేరు మిచెల్ రేబన్. ‘డైలీ మెయిల్’ నివేదిక ప్రకారం మిచెల్ అమెరికన్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు.51 ఏళ్ల మిచెల్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.మిచెల్ తన ఇంట్లో వివిధ రకాల జంతువులను పెంచుతోంది.ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె తన వంటగదిలో 50 ఎలుకలను పెంచుతోంది.
ఇది నిజంగా ఆశ్చర్యక విషయం.ఎందుకంటే ఎవరైనా ఎలుకలను తమ ఇళ్ల నుండి బయటకు తరిమికొట్టాలని ప్రయత్నిస్తుంటారు.
ఎలుకల బెడద గురించి ఆందోళన చెందుతుంటారు.అయితే మిచెల్ ఈ ఎలుకలను ఏదో ఒకటి తినిపిస్తుంటారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం మిచెల్ 25 మగ ఎలుకలు, 25 ఆడ ఎలుకలను పెంచుతోంది.ఇక్కడ తమాషా ఏంటంటే.ఈ ఎలుకలను ఆమె తన పిల్లల్లాగే చూసుకుంటుంది.2018 సంవత్సరంలో మిచెల్ తన ఇంటికి రెండు ఎలుకలను తీసుకువచ్చింది.ఆమె ఈ ఎలుకలకు ఎల్విస్, చక్ అనే పేరు పెట్టింది.అప్పటి నుండి వారి సంఖ్య నిరంతరం పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు ఆమె ఇంట్లో 50 ఎలుకల నివసిస్తున్నాయి.ఈ ఎలుకలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.ఈ ఎలుకలను మిచెల్ ‘బేబీస్’ అని పిలుస్తుంది.అంతే కాదు ఈ ఎలుకలతో పాటు ఓ పిల్లిని కూడా పెంచింది మిచెల్.అయితే ఈ పిల్లి వల్ల ఈ ఎలుకలకు ఎటువంటి హాని జరగదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.పిల్లి.
ఆ ఎలుకలు కలిసి ఆడుకుంటాయి.ఎలుకలు, పిల్లులే కాకుండా మిచెల్ వద్ద 4 కుక్కలు, 2 పెంపుడు పందులు కూడా ఉన్నాయి.
ఒక్కో జంతువుకు ప్రత్యేక స్థలం, ప్రత్యేక ఆహారాన్ని ఆమె ఏర్పాటు చేస్తుంది.







