టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు నార్త్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది.అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా మరొక పాత్రలో రాముడి పాత్రలో నటించాడు.ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో రామ్ చరణ్ కాషాయ వస్త్రాలలో ఉండి బాణాలు పట్టుకోవడంతో రాముడిలా కనిపించారు అంటూ నార్త్ లో అభిమానులు ఏకంగా థియేటర్లోనే పూజలు కూడా చేశారు.

ఇక థియేటర్లలోనే కనిపిస్తే పూజలు చేసిన అభిమానులకు రామ్ చరణ్ ఏకంగా లైవ్ లో కనిపిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం అని నార్త్ కి వెళ్లగా అక్కడ ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేసిన చిత్రబృందం తదుపరి సన్నివేశాలను చిత్రీకరించడానికి పంజాబ్ కి వెళ్లారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ కి నార్త్ లో బాగా క్రేజ్ రావడంతో చెర్రీ షూటింగ్ కి వచ్చారని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు.చాలామంది అయితే రామ్ చరణ్ తో ఫోటోలు దిగడం కోసం ఎగబడ్డారు.దీనితో పంజాబ్ పోలీసులతో షూటింగ్ ప్లేస్ లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
షూటింగ్ గ్యాప్ లో పంజాబ్ పోలీసులు కూడా రామ్ చరణ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.ఆడ, మగ అనే తేడా లేకుండా పోలీసులు అందరూ రామ్ చరణ్ తో ఫోటోలు తీసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.







