బుల్లితెర యాంకర్ గా, అందరికీ ఎంతో సుపరిచితమైన సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
సుమ ప్రధానపాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించారు.
విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునీ సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా మే ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయనున్నారు.సుమ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
బుల్లితెర యాంకర్ గా అందరినీ ఆకట్టుకున్న సుమ జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.







