సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కొడుకులను తమ వారసులగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.ఇలా వారసత్వంగా ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అందరి కంటే విభిన్నంగా కొడుకును వదిలేసి కూతురిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.మహేష్ బాబుకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే.
వయసు రీత్యా సితార కన్నా గౌతమ్ చాలా పెద్దవాడు.కానీ మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ను ఏమాత్రం పరిచయం చేయకుండా తన కూతురు సితారను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో తన కూతురు గురించి పెద్ద ఎత్తున పోస్టులు చేయడం, తనని ప్రశంసించడం చేస్తున్నారు.
సితార కూడా ఇంత చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది.ఇలా మహేష్ బాబు కొడుకు కన్న కూతురికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అలాగే మహేష్ బాబు కూడా తన కొడుకుని కాకుండా కూతురిని ప్రమోట్ చేయడం చూస్తుంటే మహేష్ బాబు తన కొడుకుని హీరోగా కన్నా కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి చాలా తొందరగా పరిచయం చేయనున్నారని తెలుస్తోంది.
ఇలా కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయడం కోసమే తనని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నారని అందుకే తన కొడుకు గురించి మహేష్ బాబు ఆలోచించడం లేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం ప్రస్తుతం గౌతమ్ తన చదువు రీత్యా విదేశాలలో ఉండటంవల్ల తన చదువుకు ఆటంకం కలగకుండా ఉండడం కోసమే మహేష్ బాబు తన కొడుకు గురించి ప్రస్తావించడం లేదని చెప్పుకొస్తున్నారు.ఏదిఏమైనా ప్రస్తుత ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.