రోజా కంటే ముందే హైపర్ ఆది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడా.. అందుకే స్కిట్స్ లేవా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.

 Hyper Aadi Jabardasth Mla Roja Aadi Skits Missing In Jabardasth Jabardasth, Hype-TeluguStop.com

అంతేకాకుండా ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే జబర్దస్త్ షో కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఇకపై ముందు ముందు జబర్దస్త్ లో ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి.చాలా మంది అయితే జబర్దస్త్ షో ముందు ముందు ఇక ఉండదు అన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

ఎందుకంటే జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో కి కళ తగ్గిపోయింది.

ఆ తర్వాత జబర్దస్త్ షోకి సోలో జడ్జిగా వ్యవహరిస్తూ నెట్టుకొచ్చింది రోజా.తాజాగా రోజాకి మంత్రి పదవి దక్కడంతో ఆమె కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది.

అంతేకాకుండా ప్రస్తుతం జబర్దస్త్ షోలో కమెడియన్స్ కూడా అంతగా కనిపించడం లేదు.సరైన జడ్జీలు, కమెడియన్స్ లేకపోవడంతో జబర్దస్త్ కామెడీ షో మసకబారుతోంది.ఇక ఆ జబర్దస్త్ హైపర్ ఆది, ఎక్స్ ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ అండగా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు హైపర్ ఆది కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు.హైపర్ ఆది ఏకంగా మూడు వారాల నుంచి జబర్దస్త్ లో కనిపించడం లేదు.

Telugu Comedians, Hyper Aadi, Jabardasth, Naga Babu, Roja, Sridevi-Movie

దీంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే రోజా కంటే హైపర్ ఆది ముందుగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా, లేకపోతే మరేదైనా కారణాలతో జబర్దస్త్ దూరం అయ్యాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జబర్దస్త్ షో కి దూరమైనప్పటికీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో తన పంచులతో కడుపుబ్బ నవ్విస్తున్నారు హైపర్ ఆది.కానీ జబర్దస్త్ లో మాత్రం హైపర్ ఆది కనిపించడం లేదు.ఇక రోజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జబర్దస్త్ షో కి అలాగే బుల్లితెరపై పలు షోలకు గుడ్ బై చెప్పేసింది.ఇక ఆమె జబర్దస్త్ షో నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ఒక ప్రోమోను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

అందులో జబర్దస్త్ నుంచి విడిపోతున్నందుకు రోజా ఎమోషనల్ అయ్యింది.ఒకవైపు రోజా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయింది.మరొకవైపు హైపర్ ఆది రోజా కంటే ముందుగా మూడు వారాల నుంచి జబర్దస్త్ లో కనిపించడం లేదు.దీనితో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube