టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఇతనే.. ఆ సర్వేలో తొలిస్థానంలో ఎవరంటే?

టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తరచూ జరుగుతుంది.ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబులకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయా హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోనే నంబర్ వన్ హీరో అని ఫిక్స్ అవుతున్నారు.

 Tollywood Number One Hero Details Here Goes Viral , Tollywood, Armax Media, Prab-TeluguStop.com

ఆర్మాక్స్ మీడియా సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానంలో ప్రభాస్ నిలిచారు.

గత కొంతకాలంగా ఈ జాబితాలో తొలి స్థానాన్ని సంపాదించుకున్న బన్నీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూడో స్థానంలో నిలిచారు.మహేష్ బాబు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో ఉన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.ఈ జాబితాలో నాని 7వ స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

Telugu Allu Arjun, Armax, Chiranjeevi, Jr Ntr, Mahesh Babu, Number, Pawan Kalyan

రవితేజ తొమ్మిదో స్థానంలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.ప్రస్తుతం ఈ టాలీవుడ్ స్టార్స్ అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.తమ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఈ స్టార్ హీరోలు భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో ఏ హీరో నంబర్ వన్ స్థానంలో పర్మనెంట్ అవుతారో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు.

Telugu Allu Arjun, Armax, Chiranjeevi, Jr Ntr, Mahesh Babu, Number, Pawan Kalyan

మహేష్, పవన్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావాల్సి ఉండగా తర్వాత సినిమాలతో తమకు కూడా ఈ గుర్తింపు దక్కుతుందని హీరోలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.మహేష్, పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube