లీక్.. రాజమౌళి, మహేష్ కథ ఇదే.. ఈసారి జక్కన్న టార్గెట్ అదే!

దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.రాజమౌళి మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

 Rajamouli Mind Blowing Script For Mahesh Babu , Mamesh Babu , Rajamouli , Rrr ,-TeluguStop.com

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా మార్చి 25న విడుదల అయ్యి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రాజమౌళి ఫుల్ ఫోకస్ అంతా మహేష్ బాబు సినిమాపై పెట్టాడు.రాజమౌళి మహేష్ బాబు తో ఒక భారీ అడ్వెంచర్ సినిమాను తెర మీదకు తీసుకు రాబోతున్నాడు.

ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ హీరోలు కాబట్టి వాళ్ళను మాస్ గా చూపించాడు.

మరి మహేష్ బాబు క్లాస్ హీరో కాబట్టి మహేష్ బాబు ను ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Telugu Maheshrajamouli, Mamesh Babu, Rajamouli, Rajamoulimind, Sarkaruvaari, Ssm

ఈసారి రాజమౌళి టార్గెట్ సక్సెస్ గ్రాఫ్ ను మరొక లెవల్ లోకి తీసుకు వెళ్లడమే అని తెలుస్తుంది.మహేష్ కోసం జక్కన్న స్పై త్రిల్లర్ కథాంశం ని ఎంచుకున్నట్టు లీక్ అయ్యింది.ఇందులో మహేష్ బాబు రా ఏజెంట్ గా కనిపిస్తారట.

ఈ సినిమా జేమ్స్ బాండ్ 007 తరహా లోనే మరో లెవల్లో ఉంటుందని తాజా గుసగుస.అంతేకాదు ఈ సినిమాకి ప్రిడేటర్, మ్యాట్రిక్స్ తరహా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ జోడించి తీయాలని రాజమౌళి చాలా కసరత్తు చేస్తున్నాడట.

మహేష్ తో ఈసారి మెస్మరైజ్ చేయబోతున్నాడట.బుధ భవిష్యత్ వర్తమాన కాలాల్లో మహేష్ ట్రావెలింగ్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.అందుకోసం రాజమౌళి 400 కోట్ల భారీ బడ్జెట్ కూడా వెచ్చించ బోతున్నారని తెలుస్తుంది.మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.

Telugu Maheshrajamouli, Mamesh Babu, Rajamouli, Rajamoulimind, Sarkaruvaari, Ssm

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తు బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది.దీని తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత జక్కన్న సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube