ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి జగన్‌ మీద విషం కక్కుతోంది.. మంత్రి అంబటి రాంబాబు

ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతోందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అని ఈనాడు రాసిందని మండిపడ్డారు.

 Ambati Rambabu Fires On Eenadu Over False News On Polavaram Details, Minister Am-TeluguStop.com

ఏదో జరిగిపోతున్నట్లు ప్రజల్లో నెమ్మదిగా విషం ఎక్కించే పని చేస్తోందని విమర్శించారు.అదే చంద్రబాబు హయాంలో శరవేగంతో పోలవరం పనులు అని సదరు పత్రిక రాసినట్లు అంబటి రాంబాబు గుర్తు చేశారు.

వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.

పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అని, పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.

ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని, కాబట్టి దశలవారీగా చేస్తారని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందన్నారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని, అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని తెలిపారు.కానీ ఈనాడు పత్రిక విషం నింపే పని చేస్తోందని దుయ్యబట్టారు.రూ.800 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఎవరు కారణమో ఆ పత్రిక ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube