యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.
ఈ పాత్రల్లో వీరు హీరోయిజాన్ని చూపించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో విభిన్నంగా స్పందించారు.ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రకటించిన కూడా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.దీంతో ఈ సినిమా ఉంటుందా ఉండదా అని అంతా అనుకున్నారు.
కానీ ఇటీవలే ఈ సినిమా ఉంటుంది అని క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.జూన్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది.

దీంతో ఈ సమయంలో ఎన్టీఆర్ తన లుక్ మొత్తం మార్చేసి కొత్త లుక్ లోకి మారిపోయాడు.తాజాగా వైరల్ అవుతున్న ఫోటో చుస్తే ఇది అర్ధం అవుతుంది.ఈయన మేకోవర్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు.జుట్టు కత్తిరించి, గడ్డం కూడా కొత్త స్టైల్ లో ఉంది.మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ కోసం రగ్డ్ లుక్ లో కనిపించి ఇప్పుడు మాత్రం కొరటాల సినిమా కోసం మళ్ళీ క్లాస్ లుక్ లోకి వచ్చేసాడు.బయటకు వచ్చిన ఈ లుక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఆ ఫోటో మీ కోసం.







